బైక్ పై ముగ్గురు మూర్ఖుల విన్యాసం..
posted on Jun 11, 2021 8:48AM
‘‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టుతప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ ఏంటి..? సినిమా టైటిల్ ఇంత ల్యాగ్ ఉందనుకుంటున్నారా..? సినిమా టైటిల్ కదండీ సైబరాబాద్ పోలీసులు టైటిల్. ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రము పాటించకుండా.. ఒక్క బైక్ మీద ముగ్గురు వెళుతూ.. బైక్ డ్రైవ్ చేసే వాడు ఎంతో బిజీ పర్సన్ లాగ కటింగ్ ఈస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ మీటింగ్ ఉన్నట్లు ఫోన్ చేస్తున్నాడు.. బైక్ పై వాడి వెనక కూర్చున్నవాడు.. బైక్ ని డ్రైవ్ వాడికి ఫోన్ చూపిస్తుంటే వాడి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు.. ఒక్క బైక్ ఒక్కటే..? కానీ మూర్ఖులు ముగ్గురు.. మూర్ఖులు అని ఎందుకు అంటున్నాను అంటే అర్జెంట్ అయితే ఎవరైనా బైక్ మీద ముగ్గురు వెళ్తారు.. బట్ వీళ్ళు ముగ్గురు వెళ్లడం తప్పు.. డ్రైవ్ చేస్తున్నవాడు ఫోన్ చూడడం తప్పు.. అన్నింటికీ మించి హెల్మెట్ కూడా లేకపోవడం మరో తప్పు ఇలా తప్పులు చేసి చివరికి వాళ్ళు చస్తే చివరికి ఆ తిప్పలు వాళ్ళ అమ్మానాన్నలు పాడుతారు.. సరే ఇంతకీ జరిగిందో తెలుసుకుందాం..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువకులు ఓ బైక్‌పై వెళుతున్నారు. వాళ్లు చేసిన విన్యాసం ఏంటో తెలుసా? మధ్యలో కూర్చున్న వ్యక్తి తన రెండు చేతులను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చుట్టేసి మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తున్నాడు. పైగా వాళ్లకి కరోనా టైం లో మాస్కులు ఉన్నా సరిగ్గా పెట్టుకోలేదు. హెల్మెట్ కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు సదరు యువకుల విన్యాసాన్ని ఫోటో తీసేశారు. రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు మీరితే ఫైన్లు ఏ స్థాయిలో పడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంగకాలం ఎండలాగే హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్లు మండి పోతాయి.
అయినా చాలా మంది యువత ముఖ్యంగా హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ, అందులోను ర్యాష్‌గా బండి నడుపుతూ దొరికిపోతుంటారు. ఒక వేళా టైం బాగుంది పోలీసుల నుండి తప్పించుకోవచ్చేమో గానీ హైదరాబాద్ పోలీస్ కెమెరాలు తప్పించుకోరు.. తాజాగా వీరి ఫొటోస్ ని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఆ ట్విట్ కి పెట్టిన టైటిల్ మన ఫస్ట్ లైన్ లో చెప్పుకున్న మాటలు. ఇది ఇలా ఉండగా తప్పు చేసిన వాడికి శిక్షపడాలి కదా..అందుకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడిందో తెలుసా..
రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టుతప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాని వాళ్ళ వాళ్ళ ఇంట్లో తెలిసే ప్రాబ్లెమ్ ఉంది. ఇంట్లో తెలిస్తే ఇంకా అంటే పటాస్ సినిమాలో స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చి చితక్కొట్టినట్లు కొడుతారు..ఇక ఈ యువకులు చేసిన ఈ తప్పునకు విలువ ఎంత పడిందో తెలుసా? ఏకంగా రూ.3600. ఈ ముగ్గురు ఈ ఒకే విన్యాసంతో ఏకకాలంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారు. బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని కారణంగా రూ.100, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు సరిగ్గా ధరించనందుకు రూ.1000, డ్రైవర్ హెల్మెట్ ధరించని కారణంగా రూ.200, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ.3,600కు చేరింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.