ఖమ్మంలో సీపీఐ నారాయణ ఓటమి ఖాయం
posted on May 14, 2014 @ 2:15PM
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సీపీఐ కార్యదర్శి నారాయణ ఓడిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అనుమానం స్వయంగా నారాయణే కలిగిస్తున్నారు. ఖమ్మంలో తాను నైతికంగా గెలిచినట్టేనని ఆయన చెప్పారు. అంటే ఆయన నైతికంగానే తప్ప మామూలుగా ఖమ్మంలో గెలిచే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తనను ఓడించేందుకు సీపీఎం కార్యదర్శి వీరభద్రం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేశారని నారాయణ ఆరోపించారు. తనను ఓడించడానికి వీరభద్రం వైకాపా అభ్యర్థి నుంచి 15 కోట్ల రూపాయలు తీసుకున్నారని నారాయణ ఆరోపించారు. అంతేకాకుండా నారాయణ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళారు. గతంలో పువ్వాడ నాగేశ్వరరావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని 70 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు తనను ఓడించేందుకు వైకాపాతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.