విమానంలో రతి క్రీడా.. ఎంజాయ్ చేసిన ప్రేమ జంట..
posted on May 27, 2021 @ 3:26PM
టెక్నాలజీ డెవలప్ అవ్వడమే. సినిమాల ప్రభావమో తెలియదు గాని.. కొంత మంది యువత హద్దులు దాటుతున్నారు. వారి కోరికలు ఇక్కడ అక్కడ అని తేడాలేదు ఎక్కుపెడితే అక్కడే తీర్చుకుంటున్నారు. శృంగారం (sex) ఒకప్పుడు నాలుగు గోడల మధ్య జరిగేది. వాస్తవానికి అలా జరిగితేనే ఆ శృగారం అందంగా ఉంటుంది. అదే నలుగురి ముందు జరిగితే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చాలా చిరాకుగా కూడా ఉంటుంది. తాజాగా ఓ జంట తమ కామ క్రీడలను నలుగురు ముందు చేశారు. తోటి ప్రయాణికులకు చిరాకు తెప్పించారు. చివరికి వారి శృంగారానికి సపోర్ట్ చేసిన ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఘటన కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కి చెందిన ఓ యువజంట కరాచీ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్తున్న పీఏ200 విమానంలో ఎక్కారు.
విమానం టేక్ అఫ్ కి తీసుకుంది. గాలిలో ఎగురుతుంది. విమానం ఎక్కిన దగ్గరనుండి ఆ జంట శృంగారం మత్తులో (sex) మునిగిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకొంటూ, మూతులు నాకుతూ, కౌగిలించుకుంటూ కామక్రీడలు (Romance) కొనసాగించారు. ఇక ఇదంతా గమనిస్తున్న తోటి ప్రయాణికులు వారి ప్రవర్తన గురించి ఎయిర్ హోస్టస్ కి తెలిపారు. వెంటనే ఆమె ఆ జంట వద్దకు వెళ్లి.. విమానంలో ఇలాంటి పనులు చేయడం కుదరదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వివరించింది. అయినా, వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ రాసలీలలను కొనసాగించారు. ఇక దీంతో ఎయిర్ హోస్టస్ చేసేదేమిలేక వారిద్దరిపై దుప్పటి కప్పి వెళ్ళిపోయింది.
ఇక ఇదంతా గమనిస్తున్న బిలాల్ అనే లాయర్ ముద్దులతో ఆ జంట అంతలా చెలరేగిపోతుంటే.. వారిపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి కంప్లైంట్ చేశాడు. దీంతో సివిల్ ఏవియేషన్ అథారిటీ మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ సీపీఏ వార్నింగ్ ఇవ్వడంతో పాటు సదరు ఎయిర్ హోస్టస్ ని ఉద్యోగం నుండి తొలగించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.