ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి
posted on Apr 28, 2020 @ 1:13PM
ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 1,177 కి చేరాయి. నిన్న ఒక్కరోజులో 80 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 7జిల్లాల్లో కొత్త కేసులు లేవు. రాష్ట్రం లో ఇప్పటికి 31 మంది మృతి చెందారు. కృష్ణా లో కోవిడ్ ఆసుపత్రి డాక్టర్ కరోన పాజిటివ్ సోకింది. ఇప్పటివరకూ రాష్ట్రం లో 74,551 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఏ.పి.లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గగా, రికవరీ శాతం పెరుగుతోంది.
రెడ్ జోన్ ప్రాంతాల్లో అకారణంగా రోడ్డుపైకినవస్తే, పోలీసులు క్వారంటైన్ కి పంపుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూల్ లో 292, గుంటూరు 237, కృష్ణా210, నెల్లూరు79, చిత్తూరు73, కడప58, ప్రకాశం56, ప. గో.54, అనంతపురం53, తూ. గో.39, విశాఖ22, శ్రీకాకుళం లో 4 కేసులు నమోదయ్యాయి.