తిరుమలలో తగ్గిన రద్దీ
posted on Jul 24, 2020 @ 2:28PM
గురుడసేవ ఆలయం మండపంలోనే
ఎప్పుడు రద్దీగా ఉంటూ నమో వెంకటేశాయ అంటూ ప్రతిధ్వనించే ఏడు కొండలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో నిశబ్ధంగా మారాయి. లాక్ డౌన్ ఎత్తేసి ఆలయాల్లోకి భక్తులను అనుమతించిన తర్వాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత పెరిగినా.. టీటీడి ఉద్యోగులకు, అర్చకులకు కరోనా రావడంతో మళ్ళీ భక్తుల తాకిడి తగ్గింది. రోజూ లక్షలాది మంది సందర్శించుకునే తిరుమలలో వేల సంఖ్యలోనే దర్శనాలు అవుతున్నాయి. కరోనా కారణంగా దర్శనం టికెట్లను ఇవ్వడం లేదు. కేవలం ఆన్ లైన్లో గతంలో బుక్ చేసుకున్నవారిలో చాలామంది తమ దర్శనం టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆలయంలో జరగాల్సిన చాలా సేవలను రద్దు చేశారు. ప్రతి ఏటా గరుడ పంచమి రోజు గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగే స్వామి సేవను ఈ ఏడాది రంగనాయకుల మండపం వరకే పరిమిత చేస్తున్నారు.