రోజుకి 100 టెస్టులు చేస్తే ఎలా రాజేంద్రా?
posted on May 2, 2020 @ 5:52PM
రోజుకీ 100 టెస్టులు చేస్తే అమెరికా,రష్యా కూడా కరోనా ఫ్రీ అవుద్ది రాజేంద్ర. సెకండరీ కాంటాక్ట్ కేసులకి ...ఢిల్లీ వెళ్ళని వాళ్ళకి...విదేశాల నుండి రాని వాళ్ళకి తెలంగాణలో కరోనా టెస్టులు చేయరంట.(ఇది తెలంగాణ ప్రభుత్వం ఆఫీసియల్ గా ప్రకటించింది)
గుంటూరు సిటీలో 140 కేసుల్లో 110 కేసులు సెకండరీ కాంటాక్ట్ కేసులే...కానీ తెలంగాణా రాష్ట్రంలో సెకండరీ కాంటాక్ట్స్ కి కరోనా పరీక్షలు చేయరు( వాళ్ళకి కరోనా లక్షణాలు ఉన్నా చేయట్లేదు ).
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లక్షణాలు లేని వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోరు అంట (ఈ లెక్కన మన దేశంలో 100 లో 80 మందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.)
ఓక పక్కన సరిగ్గా టెస్టులు చేయకుండా...కరోనా వచ్చినా వ్యాధి తీవ్రత లేదని హాస్పిటల్ లో చేర్చుకోకుండా అబద్దాలు చెప్పుకుంటూ సక్సెస్ఫుల్ గా మీడియాని మ్యానేజీ చేస్తున్నారు ...మీ రాష్ట్రం మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కాదనం.
ఇంతకీ 7 రోజులుగా కేంద్ర బృందాలు తెలంగాణ లో ఎందుకు పర్యటిస్తున్నాయో చెప్తావా??
తెలంగాణలో చివరిగా మరణించిన 3 మరణాల్లో ...ఒకరు హాస్పిటల్ లో చేరిన 6 గంటల్లో... మరొకరు 12 గంటల్లో ...మూడో వాళ్ళు 24 గంటల్లో ఎందుకు చనిపోయారో చెప్తావా ??
ముందే వాళ్ళని గుర్తించి హాస్పిటల్ లో చేర్పిస్తే బ్రతికేవాళ్ళు కదా !! ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజుల్లో ఒక్క కరోనా మరణం కూడా లేదు. ఈ విషయమే ప్రశ్నిస్తే మీ ముఖ్యమంత్రి ఏమో ప్రశ్నించినవాడికే కరోనా రావాలంటూ శాపనార్ధాలు పెడతారు!