ఏపీలో ఒక్కరోజులో 62 కరోనా మరణాలు
posted on Jul 21, 2020 @ 5:14PM
ఏపీలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ ని పరీక్షించగా.. 4,944 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో 62 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,668కి చేరగా.. కరోనా మరణాల సంఖ్య 758కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా నమోదైన 4,944 కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి తర్వాత అత్యధికంగా గుంటూరు జిల్లాలో 577 కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలో 560, తూర్పు గోదావరి జిల్లాలో 524, కర్నూలు జిల్లాలో 515, అనంతపురం జిల్లాలో 458, కృష్ణా జిల్లాలో 424, కడప జిల్లాలో 322, విశాఖపట్నం జిల్లాలో 230, విజయనగరం జిల్లాలో 210, నెల్లూరు జిల్లాలో 197, ప్రకాశం జిల్లాలో 171, శ్రీకాకుళం జిల్లాలో 133 కరోనా కేసులు నమోదయ్యాయి.