బెంబేలేత్తిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 83,883 పాజిటివ్ కేసులు
posted on Sep 3, 2020 @ 12:19PM
భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. మనదేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 83,883 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,043 మంది కరోనా తో మరణించారు. ఇది ఇలా ఉండగా నిన్న 68,584 మంది కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. ఇప్పటికే కరోనా పై పోరాడి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది.
కాగా, రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 8,25,739 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా అక్కడ కొత్తగా 17,433 కరోనా కేసులు నమోదు కాగా 24 గంటల్లో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.