గ్యాస్ పై కిరణ్ కు సింధియా షాక్
posted on Feb 19, 2013 @ 5:40PM
ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సింధియా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిసారని, రాష్ట్రానికి అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన వివరించారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా సూచించారు. గుజరాత్..ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా వివరించారు.