కేసీఆర్ హనీమూన్ పూర్తయింది

 

ముఖ్యమంత్రి కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాంఛి రసికుడైన దిగ్విజయ్ సింగ్ ఏ మాట మాట్లాడినా అందులో కాస్తంత రసికత్వం వుంటుంది. కేసీఆర్ హనీమూన్ ముగిసిందంటే అర్థం... కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఎనిమిది నెలలు అవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలదొక్కుకోవడానికి కొంత కాలం పడుతుంది కదా.. ఆ కొంత కాలాన్ని పొలిటికల్‌గా ‘హనీమూన్’ అంటారన్నమాట. ఈ సమయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరన్నమాట. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలం పూర్తయింది కాబట్టి ఆ ‘హనీమూన్’ పీరియడ్ ముగిసిపోయిందని దిగ్విజయ్ సింగ్ ఉద్దేశం. సీఎం కేసీఆర్ ప్రభుత్వం హనీమూన్ కాలం ముగిసింది కాబట్టి ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటామని డిగ్గీ రాజా ఆవేశంగా చెప్పారు.

Teluguone gnews banner