పొమ్మన లేక పొగపెట్టారు.. నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. దానం
posted on Dec 7, 2015 @ 11:11AM
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ లో చేరాలని నన్ను అడిగిన మాట వాస్తవమే.. పార్టీ మారతానని పదే పదే అని నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు. పొమ్మన లేక పొగపెట్టారు.. కానీ ఇప్పుడు అవన్నీ ముగిసిపోయాయని తెలిపారు. గ్రేటర్ పరిధి తగ్గించే ప్రయత్నాలే నన్ను బాధించాయి.. గ్రేటర్ కేడర్ నావైపే ఉంది.. నాకోసం ప్రాణాలు ఇస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలపై రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తామని.. రేపు చర్చించాల్సిన అంశాలపైనే షబ్బీర్ ఇంట్లో భేటీ అని.. ఎన్నికల వ్యూహాన్ని రేపు ఖరారు చేస్తాం.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని వ్యాఖ్యానించారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని.. కిరయి నేతలతో ప్రభుత్వం నడపాలని టీఆర్ఎస్ చూస్తుందని మండిపడ్డారు. కొనేస్తాం.. పరిపాలిస్తాం అంటే ప్రజలు మెచ్చరు.. కొత్త రాష్ట్రంలో ఈ పద్దతి మంచిది కాదని సూచించారు. ఏ ఉపఎన్నికల్లో గెలవని టీడీపీ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు గ్రహణం పట్టింది.. త్వరలోనే పుంజుకుంటాం అని స్పష్టం చేశారు.