యువరాజుకి పెళ్ళే కాలేదు..కానీ ముసలోళ్ళు రెండేసి పెళ్ళిళ్ళా..అవ్వ!
posted on Jun 18, 2014 @ 10:51AM
నిన్న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పార్టీ ఓటమికి కారణాలు కనుగొనడం సంగతి ఎలా ఉన్నప్పటికీ మంచి పసందయిన కబుర్లు సాగాయి. వాటిలో కొన్ని:
ఆనం వివేకానంద రెడ్డి: వయసులో ఉన్న కుర్రోడు (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోకుండా పార్టీ కష్టపడుతుంటే ముసలోళ్ళకి (దిగ్విజయ్ సింగ్) రెండేసి మూడేసి పెళ్ళిళ్ళా..అవ్వ!
రాష్ట్ర విభజన చేస్తే చేయనీయమని సీమాంధ్ర ప్రజలు అనుకొన్నారు. కానీ మన పార్టీ విభజన చేసిన తీరే చాలా అన్యాయంగా ఉంది. అందుకే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని చాలా కసితో పగబట్టినట్లుగా ఓడించారు.
డిల్లీ నుండి డక్కీ రాజాలు డక్కా రాజాలు ఇక్కడకు వచ్చి వాలిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వారికి మన బాష తెలియదు. మన సంస్క్ర్తుతి గురించి తెలియదు. మన భావోద్వేగాల గురించి తెలియదు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడేయడంతో ఇక్కడ ప్రజలలో టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారి కారణంగానే మనకి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది.