కాంగ్రెస్ కు మరో షాక్ ..రాహుల్ పై నమ్మకం లేకనేనట!
posted on Mar 11, 2021 @ 1:02PM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పార్టీ సీనియర్ నాయులు ఎవరూ, ఎన్నికల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీ కూడా సీనియర్లను పట్టిచుకోవడం లేదు. జీ 23 పేరు తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకులు, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రాష్ట్రాలలో ఏమి జరుగుతుందో ఏమో కానీ, జాతీయస్థాయి నేతలు అయితే, రాహుల్, ప్రియాంక తప్ప ఇతర నాయకులు ఎవరూ ప్రచారంలో కనిపించడం లేదు. ఆ ఇద్దరు కూడా అంతంత మాత్రంగానే కానీ, ప్రభావవంతంగా ప్రచారం సాగిస్తున్నట్లు లేదు.
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తమ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.అయన తమ రాజీనామాకు పార్టీలో వర్గపోరు కారణంగా చూపించేరు. అయితే, పార్టీకి ఇక బతుకు లేదనే నిర్ణయానికి రావడం వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
‘ప్రస్తుతం నాయకత్వం లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలి పోయింది.సుదీర్ఘ కాలంగా అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్ ముందుకెళుతోంది.ఈ సమయంలో పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు’ అని చాకో ఒక విధమైన నిర్వేదాన్ని వ్యక్త పరిచారు. పార్టీ ప్రభావం వేగంగా పడిపోతుందని, తన రాజీనామా అదే అసలు కారణం అని చెప్పకనే చెప్పారు. కేరళలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకపోవడంపై కూడా చాకో అసంతృప్తిని వ్యక్త పరిచారు. అయితే, జమ్మూలో జీ 23 నేతలు చెప్పిన, ఇంకో చోట ఇంకో కాంగ్రెస్ నాయకుడు చెప్పినా,లేఖలే రాసినా అన్నిటి సారంశం ఒకటిగానే ఉందని, రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.