కర్నూలు కోల్డ్ వార్...
posted on Mar 13, 2020 @ 8:14PM
స్థానిక సమరంలో తారాస్థాయికి చేరుకున్న ఇంటిపోరు
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,జగన్ బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ఇన్ సైడ్ వార్
రాజీనామా అస్త్రంతో అధిష్టానం పై తిరుగుబాటు చేసే యోచనలో హఫీజ్ ఖాన్
హఫీజ్ కి చెక్ పెట్టి నియోజికవర్గం లో పట్టు సాధించాలి అని ఎస్వీ విశ్వప్రయత్నాలు
మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు తయారైంది కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిస్థితి.ఒక పక్క ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ ల పై జగన్ వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్న హఫీజ్ ఖాన్ ని కష్టాలు వెంటాడుతున్నాయి.ఎన్నికల ముందు కండువా కప్పించుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి నిద్రపట్టకుండా చేస్తున్నారు.పేరుకే ఎమ్మెల్యే నియోజికవర్గం లో ఏ పని జరగాలి అన్నా ఎస్వీ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందే.మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే కావడమే నేను చేసుకున్న శాపమా అని ఎమ్మెల్యే కొంతమంది అధికారుల దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.కనీసం ఒక పెన్షన్,రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితి హఫీజ్ ఖాన్ ది.
నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలన్నా రెడ్డి గారు టిక్ పెట్టాల్సిందే.10 నెలలుగా నరక యాతన పడుతున్నా మీడియా ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చెయ్యడం తప్ప హఫీజ్ ఖాన్ చెయ్యగలిగింది ఏమి లేదు.మైనార్టీ నేతలు ,కార్యకర్తలు తప్ప మిగిలిన క్యాడర్ ఎమ్మెల్యే మొహం చూడాలి అంటేనే భయపడే పరిస్థితి.ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలు హఫీజ్ ఖాన్ కి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి.నేను గెలిస్తే మిమల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలు ఇచ్చిన హఫీజ్ ఖాన్ కి షాక్ తగిలింది.తాను పంపిన లిస్ట్ లో 90 శాతం పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి దక్కడం ,బీ ఫార్మ్ లు కూడా ఆయనే ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కి నియోజికవర్గం లో మొహం చెల్లడం లేదు.దింతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్తు పార్టీ నాయకుడు అనుకున్న హఫీజ్ ఖాన్ చాప్టర్ కి త్వరలోనే ఎండ్ కార్డు పడటం నియోజికవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో ఎస్వీ కి దక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.