కేసీఆర్ ప్రెస్‌మీట్ పోస్ట్‌మార్టం.. అసలు టార్గెట్ అదేనా? ఇంత మేటర్ ఉందా?
posted on Nov 8, 2021 @ 10:53AM
ఊరకరారు కేసీఆర్ మీడియా ముందుకు. ప్రజల్లోకి రాకున్నా.. చాలా రేర్‌గా ప్రెస్ ముందుకు వస్తుంటారు. ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రజలకు కనిపించే సందర్భం అదొక్కటే. మరి, ఆదివారం అంతా హాలిడే మూడ్‌లో ఉండగా.. సడెన్‌గా కేసీఆర్ మీడియా సమావేశం పెట్టడం.. బండి సంజయ్, బీజేపీ, కేంద్రాన్ని బండకేసి కొట్టినట్టు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ బండి సంజయ్‌ది తన స్థాయి కాదని వదిలేశానంటూ.. ప్రెస్‌మీట్ మొత్తం బండి సంజయ్ చుట్టూనే తిప్పేశారు. బండి సంజయ్‌ను తన స్థాయి లీడర్‌ను చేసేశారు. ఇక కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్.. కేసీఆర్ వర్సెస్ బీజేపీ.. కేసీఆర్ వర్సెస్ కేంద్రం.. అనేలా మెసేజ్ ఇచ్చేశారు.
పోలా, అర్థమైపోలా. కేసీఆర్ అసలు ఉద్దేశ్యమేంటో తెలిసిపోలా. కేసీఆర్ టార్గెట్ ఎవరో, ఏంటో క్లారిటీ వచ్చేయలా. ముఖ్యమంత్రి కేసీఆర్.. బండి సంజయ్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇదే ఫస్ట్ టైమ్. కేంద్రం, బీజేపీనీ అదే రేంజ్‌లో కుమ్మేశారు. ఇన్నేసి మాటలు అంటే.. కమలనాథులేమైనా మౌనంగా ఊరుకుంటారా? వాళ్లు సైతం అదే రేంజ్‌లో అటాక్ చేయడం కామన్. ఇటు, తెలంగాణలో కేసీఆర్ కొమ్ములు వంచే పోటుగాడు బండి సంజయ్ మాత్రమేనని.. అటు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడలు విరిచే మొనగాడు కేసీఆరేననేలా సీన్ క్రియేట్ కావడం ఖాయం. కేసీఆర్‌కు కావాలసింది ఇదే.. తనకు వ్యతిరేకంగా ఇటు బండి సంజయ్‌కి.. అటు బీజేపీ.. బిగ్ మైలేజ్ రావడమే ఈ ప్రెస్‌మీట్ మెయిన్ టార్గెట్...అంటున్నారు.
వన్ ప్రెస్‌మీట్.. టూ టార్గెట్స్. ఆ రెండు టార్గెట్స్‌లో ఒకరు ఈటల రాజేందర్.. ఇంకొకరు రేవంత్‌రెడ్డి అంటున్నారు. అదెలా అంటే.. తెలంగాణ రాజకీయం ఇకపై ప్రెస్‌మీట్‌కు ముందు.. ప్రెస్‌మీట్‌కు తర్వాత.. అనేలా ఉండనుందని అంచనా వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఈటల రాజేందర్.. కేసీఆర్‌కు కరెక్ట్ మొనగాడిలా నిలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్ సంగతి తేలుస్తానంటూ ఈటల సైతం శపథం చేసేశారు. సిద్దిపేటలో హరీశ్‌రావు పని పడతానంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఇకపై కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. ఇలాంటి పరిణామం కేసీఆర్‌కు బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందుకే, ఈటలను కాస్త సైడ్ ట్రాక్ పట్టించి.. బండి సంజయ్‌ను మెయిన్ ఫ్రేమ్‌లోకి తీసుకొస్తే.. అప్పుడు పొలిటికల్ వార్ కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్‌లా మారుతుంది. ఈటలతో పోలిస్తే.. బండి సంజయ్‌ను హ్యాండిల్ చేయడం కాస్త సేఫ్. అందుకే, బండి సంజయ్‌కు హైప్ వచ్చేలా.. తనతో నేరుగా తలబడేలా.. బీజేపీ అధ్యక్షుడిని తనకు వ్యతిరేకంగా బరిలో నిలిపారు. ఇదంతా కేసీఆర్ రచించిన స్క్రీన్‌ప్లే ప్రకారం జరుగుతోందని అంటున్నారు.
ఇక మరో మెయిన్ టార్గెట్ రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్. ఒక్క హుజురాబాద్ విషయం వదిలేస్తే.. కొన్ని నెలలుగా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. దళిత-గిరిజన దండోరాలు, డ్రగ్స్ దందాలో వైట్ ఛాలెంజ్‌లు, పదునైన విమర్శలతో రెచ్చిపోతున్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ కేడర్ బలంగానే ఉంది. రేవంత్‌రెడ్డి జోరు ఇలానే కొనసాగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారం హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కేసీఆర్‌కు అత్యంత ప్రమాదకారిగా మారిన రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ జోష్‌ను డైవర్ట్ చేసేందుకే.. బీజేపీని-కేంద్రాన్ని-బండి సంజయ్‌ను బయటకు లాగేలా.. ప్రెస్‌మీట్‌తో స్కెచ్ వేశారని అంటున్నారు. ప్రజలందరినీ టచ్ చేసే పాయింట్స్‌తో రచ్చ రాజేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రాన్ని బద్నామ్ చేశారు. వరి కొనడం లేదంటూ రైతుల తరఫున బలమైన వాయిస్ వినిపించారు. ఇక బండి సంజయ్‌ను బండ బూతులు తిడుతూ.. దమ్ముంటే రా.. తేల్చుకుందాం అన్నట్టు పొలిటికల్ దంగల్ క్రియేట్ చేశారు. అసలే ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన బండి సంజయ్.. కేసీఆర్ తనను అన్నేసి మాటలు అంటే చూస్తూ ఊరుకుంటారా? ఆయనా రెచ్చిపోతారు. ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ అంతా కలిసి రచ్చ రంభోలా చేస్తారు. ఈ రాజకీయ ఉద్రిక్తతలో రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ సైడ్ వేస్‌లోకి వెళ్లిపోతారనేది కేసీఆర్ స్కెచ్‌లా కనిపిస్తోందని చెబుతున్నారు. మరి, ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఈటలను, రేవంత్‌రెడ్డిని సైడ్ చేయడం అంత ఈజీగా? బండి సంజయ్‌ను బకరా చేసే సత్తా కేసీఆర్‌కు ఉందా? ముందుందంతా.. క్రొకడైల్ ఫెస్టివలే.