అక్కడే ఎక్కువగా ఉంటున్న కేసీఆర్..!
posted on Nov 5, 2015 @ 2:31PM
కేసీఆర్ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు కొత్తగా ఫాంహౌస్ వ్యవహారం చూస్తే ఆయనపై విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉంది. మామూలుగానే కేసీఆర్ కు తన ఫాం హౌస్ అంటే మక్కువ ఎక్కువ అని అందరికి తెలిసిందే. ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడికి వెళుతుంటారు. కానీ ఈమధ్య కేసీఆర్ ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. అందులోనూ తను డిసెంబర్ లో చేయనున్న చండీయాగం కార్యక్రమం ఇక్కడే కావడంతో ఆదివారం ఫాం హౌస్ కు వచ్చిన ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. అంతేకాదు ఇంకా రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉంటారట. మరి ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేయకుండా ఉంటారా.
ఇప్పటికే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదని పలువురు పలురకాలుగా అనుకుంటున్నారు. వాస్తు విషయంలో నిక్కచ్చిగా ఉండే కేసీఆర్.. సచివాలయం వాస్తు సరిగా లేకపోవడంతో అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. క్యాంపు కార్య్లలయంలోనే అన్ని పనులు చూస్తున్నారు. ఎటూ కేసీఆర్ రావడం లేదు కదా అని మరమత్తులు చేసే వారు కూడా చూసి చూడనట్టు వదిలేశారు.
ఇప్పుడు అసలు సచివాలయానికే రావడానికి ఇష్టపడని కేసీఆర్.. రోజులకు రోజులు ఫాంహౌస్ లోనే ఉంటుంటే ఆయనపై విమర్శలకు తానే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని పలువురు ఆభిప్రాయపడుతున్నారు.