భయపడకండి.. పాతవారి తర్వాతే కొత్తవారికి ప్రాధాన్యం.. చంద్రబాబు
posted on Apr 16, 2016 @ 11:30AM
వైసీపీ పార్టీ నుండి దాదాపు పదిమందికి పైగా ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇంకా కొంత మంది నేతలు చేరడానికి సిద్దంగా ఉన్నారు కూడా. అయితే వైసీపీ నేతలు టీడీపీలో చేరడం వరకూ బాగానే ఉన్నా.. వీరి చేరికతో కొంత మంది టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న తమ పరిస్థితి ఏమిటన్న భయం టీడీపీ నేతల్లో ఉందట. ఈనేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. కొత్తవారు పార్టీలోకి రావడం వల్ల పాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారంట. పాత వారికి ప్రాధాన్యం కల్పించిన తర్వాతే కొత్త వారికి అవకాశం కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారంట.