సామాజిక అసమానతలే నేరాలకు కారణం
posted on Aug 17, 2020 @ 9:59AM
క్లారా విచ్మన్(17 ఆగస్టు 1885 - 15 ఫిబ్రవరి 1922)
ఒక మనిషి నేరం చేశాడంటే అందుకు చాలావరకు సమాజమే కారణం అంటూ వాదించే స్త్రీవాద న్యాయవాది క్లారా విచ్మన్. జర్మన్ డచ్ న్యాయవాది. రచయిత, ఫెమినిస్ట్ గా గుర్తింపు పొందారు. నేరం, న్యాయం, శిక్ష తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో వ్యాసాలు ఆమె రాశారు.
హాంబర్గ్ లో 17 ఆగస్టు, 1885లో క్లారా జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ ఆర్థర్ విచ్మన్. ఖగోళ శాస్త్రవేత. వారి కుటుంబం నెదర్లాండ్స్ కు వలస వచ్చింది. క్లార్ విద్యార్థిదశలోనే స్త్రీవాద ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నేవారు. న్యాయవాద విద్యను పూర్తిచేసిన తర్వాత నేరాలు, న్యాయవ్యవస్థ, శిక్ష అంశాలపై అనేక రచనలు చేశారు. 1919లో ఆమె క్రైమ్ అండ్ పనిష్మెంటు విధానానికి వ్యతిరేకంగా కమిటీని ఏర్పాటుచేశారు. 21 మార్చ్,1920 న నేరం, శిక్ష, సమాజం అంశంపై ఆమె చేసిన ప్రసంగం అత్యంత ప్రసిద్ధి చెందింది. సామాజిక అసమానతల ద్వారా, అన్యాయాల ద్వారానే నేరప్రవృత్తి పెరుగుతుందని ఆమె అభిప్రాయం.
మానవహక్కులు, మహిళా సాధికారత కోసం ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సంస్థ సోరోప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ లో క్లారా కీలక సభ్యురాలిగా పనిచేశారు. మహిళల హక్కులపై ఎంతో పోరాటం చేసిన ఆమె 15 ఫిబ్రవరి 1922న మరణించారు. ఆమె పేరుతో ఏర్పాటుచేసిన క్లారా విచ్మన్ ఇనిస్టిట్యూట్ లో కొంతకాలం మహిళా న్యాయవాదులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఆమె జీవితం పై వచ్చిన పాసీ వూర్ వ్రిజిద్ - క్లారా విచ్మన్ (1885-1922) పుస్తకాన్ని ఆమ్ స్టర్ డ్యామ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది.