చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
posted on Mar 25, 2023 @ 4:38PM
టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమంలో ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో నోటీసుల్లో పేర్కొన్నారు.
నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు ఆ సమయంలో విజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన తండ్రి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు.
అయితే చింతకాయల విజయ్ కు మరో సారి సీఐడీ నోటీసులపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నాయి.