చైనా ఐదు సూత్రాల పథకం 'పంచశీల'
posted on Mar 20, 2013 @ 10:11AM
చైనా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జి జంగ్ పింక్ వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ దేశాల కూటమి సదస్సులో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా భారత తో సంబంధాలను మరింత మెరుగు పరచుకునేందుకు ఐదు సూత్రాల (పంచశీల)కొత్త కార్యక్రమాలను ప్రధానికి వివరించనున్నారు. సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదని దీనికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించేవరకూ స్నేహపూరిత చర్చలు కొనసాగిస్తామని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరుదేశాలు తమ మధ్య సంబంధాలకు విఘాతం కలగకుండా సరిహద్దుల వద్ద శాంతిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇరుదేశాలు బహుళపక్ష వేదిక ద్వారా పరస్పరం సహకరించుకుంటూ వర్తమాన దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జీ జింగ్ పింగ్ పేర్కొన్నారు.