వైఎస్ రికార్డును బ్రేక్ చేసిన చంద్రబాబు
posted on Jan 4, 2013 @ 11:43AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరంలో కొత్త రికార్డ్ ను సృష్టించారు. వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కొత్త రికార్డులను సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అధిగమించారు. రాజశేఖర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు.
తనకంటే వయసులో ఏంతో చిన్నవ్యక్తి అయిన ప్రతిపక్షపార్టీ నేత ఆరోగ్యకారణాలతో పాదయాత్ర చేయలేక మద్యలోనే విరమించుకొంటే, చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించడం అందరిని ఆకర్షించింది.