మొగుడు కొట్టినందుకు కాదు

 

‘మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే బాధ’ అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న 1500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేయడం, దానిని మీడియాలో ప్రముఖంగా చర్చించి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేకర్ రెడ్డి తో పోల్చుతూ విశ్లేషణలు వ్రాయడం, ఒకవైపు తమ అధినేత జైల్లో మగ్గుతుంటే మరో వైపు ఈవిధంగా తెలుగు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమనాయకుడి సాధించిన ఘనవిజయానికి సంభరాలు చేసుకోవడం చూస్తున్న, కొందరు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు సహజంగానే భగభగమని మండిపోయారు.

 

తమ నాయకురాలు ఆరోగ్య కారణాలచేతనో లేక తెలంగాణావాదులకు జడిసో మధ్యలోనే  పాదయాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే, 63 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు ఇంకా పాదయాత్ర కొనసాగిస్తుండటం వై.యస్సార్ పార్టీ నేతలకి అసూయ కలిగించడం సహజమే.  

 

 

మానాయకుడు మండు వేసవిలో మహాప్రస్థానం సాగిస్తే, మీ నాయకుడు చక్కటి చలికాలం ఎంచుకొని, తాపిగా అడుగులో అడుగేసుకొంటూ కబుర్లు చెప్పుకొంటూ, మీకోసం వస్తున్నానని ఎన్ని కి.మీ.లు నడిచినా మా నాయకుడి పాదయాత్రకు సాటి రాదు అని తీర్మానించేశారు. అప్పుడు రాజశేకర్ రెడ్డి ప్రజలకోసం (?) పాదయాత్ర చేయగా, ఇప్పుడు చంద్రబాబు కేవలం రికార్డు సృష్టించడానికే చేస్తున్నట్లు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపెట్టి ప్రజలకు ఆ విషయం తెలియజేసారు.

 

కోటి సంతకాలతో జైల్లో ఉన్న తమ నేతని విడిపించుకోవచ్చనే ఒక సరికొత్త ఐడియాని కనిపెట్టిన వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలకి 63 సం.ల వయసుగల వ్యక్తి 1500 కి.మీ. పాదయాత్ర చేయడం ఒక పాత ఐడియాగానే కనిపించడంలో వింతేమి ఉంది.

Teluguone gnews banner