Read more!

పాదయాత్రలకు ఈసి గ్రీన్ సిగ్నల్

 

 

 

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా..మీకోసం’యాత్ర, వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అమల్లోకొచ్చిన ఎన్నికల కోడ్ తో వీరి యాత్రలు ఆగిపోతాయని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి కోసం కమిషన్ ఎన్నికల కోడ్ నియమాలనే సడలించింది.


పాదయాత్రలో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు వారిని ఆయాజిల్లాల్లోనే ఉండటానికి అనమతి నిచ్చింది. ప్రస్తుతం షర్మిల, బాబుల పాదయాత్రలు గుంటూరు, ప్రకాశంల పరిసరాల్లో సాగుతున్నాయి. గుంటూరుజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో బస చేయాలని కమిషన్ సూచించింది. వీరి పాదయాత్రల తీరును సమీక్షించడానికి  జిల్లాస్థాయి అధికారిని నియమించారు.