వైఎస్ రికార్డ్ బ్రేక్...పోరాట యోధుడికి సెల్యూట్: లోకేష్
posted on Jan 5, 2013 @ 9:32AM
తన తండ్రి నారాచంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయస్సులో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం పట్ల కొందరు ఆశ్చర్యపోయారని, తనకు మాత్రం ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని, 63 ఏళ్ల వయస్సులో ప్రజల కోసం పరితపిస్తున్న పోరాట యోధుడికి సెల్యూట్ చేయాలని నారా లోకేష్ ట్విటర్ లో కామెంట్ పెట్టాడు.
చంద్రబాబు వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కొత్త రికార్డులను సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అధిగమించారు. రాజశేఖర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు.