వైఎస్ జగన్ బెయిల్ ఫై విచారణ వాయిదా
posted on Jan 5, 2013 9:12AM
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడా జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సాధారణ బెయిల్ పిటీషన్ ఫై విచారణను కోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది. నిన్న ఉదయం జగన్, సిబిఐ న్యాయవాదుల మధ్య వాదనలు ప్రారంభం అయిన వెంటనే జగన్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు విచారణను మధ్యాహ్నానికి తొలుత వాయిదా వేసారు.
ఆ తర్వాత హైకోర్టు సూచన మేరకు సిబిఐ తరపు న్యాయవాది కేశవ రావు సిబిఐ ఇప్పటివరకూ చేసిన విచారణ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, దానిని బహిర్గతం చేస్తే, తదుపరి విచారణకు ఆటంకాలు వస్తాయని కేశవ రావు కోర్టుకు విన్నవించారు. అదనపు సాలిసిటర్ జనరల్ సెలవులో ఉన్నారని, అందువల్ల తన వాదన వినిపించడానికి విచారణను వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, సిబిఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును వాయిదా వేయాలని చూస్తోందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియచేసారు.