దండుపాళ్యం బ్యాచ్ రాకపోతేనే మంచిది!
posted on Jun 11, 2024 @ 9:44PM
అబ్బ... ఇంతకంటే పెద్ద శుభవార్త వుంటుందా? చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్ హాజరు కాకూడదని నిర్ణయించుకుందట. ఈ దండుపాళ్యం బ్యాచ్ నాయకుడు జగన్‌ని ఆహ్వానించాలని చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా ఆ పోటుగాడు అందుబాటులోకి రాలేదంట. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం ఇష్టం లేకనే జగన్ ఫోన్‌కి అందుబాటులో లేకుండా పోయాడంట. దరిద్రం వదిలింది. ఈ దరిద్రపు బ్యాచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చి, ఎదురుగా కూర్చుని కళ్ళలో నిప్పులు పోసుకుని ఏడ్చి చస్తారు. శాపనార్థాలు పెడతారు. కుళ్ళుకుంటారు.. దిష్టిపెడతారు. ఈ అపశకునపు పక్షులని ఎదురుగా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు. జగన్ పార్టీ చేసిన మంచి పని ఏదైనా వుందీ అంటే... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకూడదని నిర్ణయించుకోవడం. చాలా వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఏడుపు ముఖాలు వేసుకుని ఈ వైసీపీ పిశాచాలు కూర్చుని వుంటే ఎంతమాత్రం బాగోదు. ప్రమాణ స్వీకారోత్సవంలో అందరూ ఒకర్నొకరు ఆనందంగా పలకరించుకుంటూ, కౌగిలించుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ, జై అమరావతి అని నినాదాలు చేసుకుంటూ వుంటే, అక్కడే వున్న ఈ వైసీపీ మూకలు కర్రల్లాగా బిగుసుకుపోయి, దేభ్యం ముఖాలు వేసుకుని కూర్చుని వుంటే ఏమన్నా బాగుంటుందా? అందువల్ల వైసీపీ బ్యాచ్ వాళ్ళు చంద్రబాబు ప్రమాణానికి రాకూడదని నిర్ణయించుకోవడమే చాలా మంచిదైంది. శుభమా అని చంద్రుడు ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వుంటే, అక్కడ ఈ వైసీపీ మచ్చలెందుకు?