చంచల్‌గూడ జైలుకి సుమన్ రాథోడ్

 

 

 

 

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌ మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఓ భూకబ్జా కేసులో సుమన్ రాథోడ్ పై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నించిన సుమన్ రాథోడ్ కు ఇటీవల సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దాంతో ఆమె తప్పని పరిస్థితుల్లో మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఆమెను పోలీసులు సుమన్‌రాథోడ్‌ను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.


గత కొన్నాళ్లు సుమన్ రాథోడ్ అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓ వ్యక్తి పేరు మీద ఉన్న స్థలాన్ని వీరు తప్పుడు దృవపత్రాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారు అడ్డంగా దొరికిపోయారు.
 

 

Teluguone gnews banner