ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ స్వాగతిస్తున్నా౦: చంద్రబాబు
posted on Dec 1, 2012 @ 2:57PM
బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు స్వాగతిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక కింద ఆ నిధులను సక్రమంగ ఖర్చుపెట్టాలన్నారు. ప్రణాళిక నిధులు వేరే పథకాలకు మళ్లించకుండా నిషేధం విధించాలని బాబు కోరారు.
జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిందని గుర్తుచేశారు. దళిత, గిరిజన సబ్‌ప్లాన్ బిల్లులో పదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదన్నారు. వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టంగా చెప్పినా, కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణతో మాదిగ, ఉపకులాలకు 24,500 ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లులో వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.