చంద్రబాబు మంత్రివర్గ సభ్యుల పేర్లు
posted on Jun 8, 2014 @ 4:07PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు మంత్రివర్గం ఖరారయింది. ఈరోజు ఉదయం గవర్నరు నరసింహన్ కు పంపిన జాబితాలో చంద్రబాబుతో బాటు మొత్తం 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలియజేసారు. వారెవారంటే:
అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం); కి మిడి మృణాళిని(విజయనగరం); అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావు(విశాఖపట్నం); యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప(తూర్పు గోదావరి జిల్లా); పీతల సుజాత(పశ్చిమ గోదావరి); దేవినేని ఉమా, కొల్లు రవీంద్రబాబు (కృష్ణా); ప్రతిపాటి పుల్లారావు, రావెల్ల కిషోర్ (గుంటూరు); సిద్దా రాఘవరావు(ప్రకాశం) ; నారాయణ(నెల్లూరు); బొజ్జ గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు); కేఈ కృష్ణమూర్తి (కర్నూలు); పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత (అనంతపురం). బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావులకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.
వీరిలో బీసీలకు 6, కమ్మ-6, కాపు-3 , రెడ్డి- 2, ఎస్సీ-2, వైశ్య-ఒకరికి చొప్పున మంత్రి పదవులు దక్కనున్నాయి. కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్పలు ఉపముఖ్యమంత్రులుగా నియమితులవబోతున్నట్లు సమాచారం.