రేపు బెంగుళూరుకు చంద్రబాబు
posted on Dec 27, 2023 @ 12:33PM
టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో బాటు పొరుగున ఉన్న కర్ణాటక ప్రజలు చంద్ర బాబు అరెస్ట్ ను ఖండించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం(డిసెంబర్ 28)బెంగళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీఫోరంసభ్యులతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులతో ఆయన సమావేశం అవుతారు.చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు బెంగళూరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు సంతమారనళ్లిలోని వైట్‌ఫీల్డ్-హొసకొటె రోడ్డులో ఉన్న కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ ఆహ్వానించింది