కిరణ్ కు చంద్రబాబు బహిరంగ సవాల్
posted on Apr 16, 2013 8:01AM
విశాఖజిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. గాంధీనగర్ లో జరిగిన బహిరంగ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... తొమ్మిది సంవతసరాలుగా నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ లు గుర్తుకువచ్చారా? ఎస్సీ. ఎస్టీలకు కేటాయించిన భూములను, నిధులను, ఇతర సౌకర్యాలను దిగమింగి ఇప్పుడు సబ్ ప్లాన్ అంటూ నాటకం ఆడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ కిరణ్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని, తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ లో తొంభై శాతం మంత్రులు అవినీతిపరులుగా ముద్రపద్దారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, తమ హయాంలో డీఎస్సీల ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ల పేరుతొ ఉద్యోగాలను అమ్ముకుంటున్నదని కిరణ్ కుమార్ పై విరుచుకుపడ్డారు.