విద్యుత్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే
posted on Aug 21, 2022 @ 4:58PM
గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్) నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధిం చిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రా నికి సమాచారం అందడంతో ఇంధన ఎక్స్ఛేంజీ విద్యుత్తు కొనుగోలుకు అనుమతులను పునరుద్దరించింది.
విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది. తొలుత తెలం గాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.
శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్ నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్రం నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్ ద్వారా విద్యు త్ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవల గరిష్ఠ విద్యుత్ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది 2021 ఆగస్టు 18న ఈ డిమాండ్ 8,500 మెగావాట్లు మాత్రమే ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేక పోవడం, ఉష్ణోగ్ర తలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది.
ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వరదల కారణంగా, పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్ నుంచి చెల్లింపుల్లో జాప్యానికి సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి విదితమే.