మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి సమస్య.. చిటికెలో పరిష్కారం!
posted on Aug 19, 2024 @ 11:01AM
నారా చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారం విషయంలో అనితర సాధ్యమైన వేగంతో ఉంటారు. జగన్ హయాంలో పరిష్కారానికి నోచుకోకుండా రోగులను నానా యాతనా పెట్టిన మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి సమస్యను చంద్రబాబు అధికారంలోకి రాగానే చిటికెలో పరిష్కారం చూపారు. మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి పరిష్కారం కోసం ప్రభుత్వ చొరవ కారణంగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ పైపులైన్లు వేయడానికి అనుమతి మంజూరు చేసింది.
ఇదే గత వైసీపీ ప్రభుత్వం అసలు మంగళగిరి ఎయిమ్స్ ఆసపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అసలు ప్రయత్నమేదీ చేయలేదు. బాధలు పడేది ప్రజలే కదా అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులు దాహార్తితో నానా బాధలూ పడ్డారు. జగన్ సర్కార్ ఎయిమ్స్ కు తాగునీటి సమస్య లేకుండా పైప్ లైన్లు వేయడానికి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టింది. ఏదో విధంగా స్టేజ్ 1 అనుమతులు తీసుకున్నప్పటకీ రోడ్డు కట్టింగ్ చార్జీలు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పనులను ఆరంభిం చేందుకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో జగన్ హయాంలో ఎయిమ్స్ కు వచ్చే రోగులు తాగునీటి కోసం కటకటలాడారు. వాళ్లే కాదు వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులూ కూడా సమస్యలు ఎదుర్కొ న్నారు.
అయితే ఎప్పుడైతే చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టారు.. ఆ క్షఏణం నుంచీ మంగళగిరి ఎయిమ్స్ కు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుబనంద భాకర్ చంద్రబాబును కలిసి సమస్యను వివరించిన వెంటనే ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో పర్సనల్ గా మాట్లాడారు. చంద్రబాబు స్వయంగా చొరవ చూపడంతో సమస్య చిటికెలో పరిష్కారం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ పనులకు అనుమతి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన జీవో నేడో రేపో విడుదల కానుంది. 850 మీటర్ల పైప్ లైన్ ద్వారా ఎయిమ్స్ కు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది.