అమెరికా గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ పై చంద్రబాబు
posted on Jun 6, 2024 @ 3:50PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఘనతను ప్రపంచం మొత్తం గుర్తించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సాంకేతికతను సుపరిపాలనకు ఉపయోగించుకోవడం ఎలాగో ప్రపంచానికి ఆచరించి చూపారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వంటి వారు పలు సందర్భాలలతో చంద్రబాబు విజన్ ను ప్రశంసించారు.
ఒక విజనరీని రాజకీయ కారణాలతో అణగదొక్కాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతూ వచ్చింది. తాజాగా భారత్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలు కాగానే భారత మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
మళ్లీ చంద్రబాబు ఎన్డీయేలోనే ఉన్నాం కొనసాగుతాం అని ప్రకటించిన తరువాతే పుంజుకున్నాయి. ఒక్క భారత మార్కెట్లే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. ఇందుకు కారణం చంద్రబాబునాయుడే అంటూ అమెరికా గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ పై చంద్రబాబు ఫొటోను డిస్ ప్లే చేశారు. దటీజ్ చంద్రబాబు.