గవర్నర్ నరసింహన్‌ను విచారించిన సిబిఐ
posted on Jul 9, 2014 @ 12:56PM
ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకున్న సీబీఐ అధికారులను ఆగస్టా కేసులో గవర్నర్ నుంచి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎమ్.కె.నారాయణన్ ను, అలాగే గోవా గవర్నర్ వాంచూని వాంగ్మూలాలను కూడా సిబిఐ నమోదు చేసింది. ఆ తరువాత వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజకీయవర్గాల తాజా సమాచారం ప్రకారం అప్పట్లో గవర్నర్ లెజెన్స్ బ్యూరో ఛీప్ అధికారిగా వున్నారు కాబట్టి ప్రధాని వద్ద జరిగే కీలక సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు తప్ప ఆయనకు ఆ కేసుతో ఎలాంతో సంబంధం లేదు. కానీ ఆ సమావేశానికి హాజరయ్యారు కాబట్టే ఇప్పుడు సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గవర్నర్ సన్నిహితులు అంటున్నారు. మరీ నరసింహన్ ఇప్పుడు మిగతా గవర్నర్ల బాటలో నడుస్తారా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.