పవన్ కి బిగ్ షాక్... జనసేనకు రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ!
posted on Jan 30, 2020 @ 5:41PM
జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ.. పవన్ కల్యాణ్‌కు లక్ష్మీనారాయణ లేఖ రాశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. ఇక సినిమాల్లో నటించబోనని చెప్పిన పవన్.. ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. పవన్‌లో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇన్నిరోజులు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.