బైరెడ్డి.. ఇంట్లోనే దీక్ష.. ఎన్నిరోజులు బంధిస్తారు?
posted on Sep 15, 2015 @ 12:08PM
రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తలపెట్టిన రైతు రైతు బతుకు దెరువు యాత్రను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా కర్నూలు జిల్లా తంగడంచ మండలంలో పరిశ్రమల కోసం భూసేకరణకు పూనుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా బెరైడ్డి తగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పాదయాత్రకు అధికారుల అనుమతి లేదని ముందుగానే అతనిని గృహనిర్బంధం చేశారు.
అయితే పోలీసులు బైరెడ్డిని గృహనిర్భందం చేయడంతో ఆయన ఇంటి వద్దనే తన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతకాలం ఇలా నన్ను ఇంటిలో బంధిస్తారు.. ఏ రోజైనా బయటకు వస్తానని అప్పుడు మళ్లీ పాదయాత్ర నిర్వహిస్తానని అన్నారు. ప్రభుత్వ ఈ రకంగా రైతుల మీద తమ వ్యతిరేకతని చూపించిందని.. వారి భూములు తీసుకొని వారి పొట్టలు కొట్టొద్దని చెప్పారు. ఇప్పటికైనా భూ సేకరణను ఆలోచన మానుకొని దానిని ఆపేస్తే తాను కూడా పాదయాత్రను విరమించుకుంటానని, లేకపోతే పాదయాత్ర ఒక్కటే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చరించారు.