జగన్‌కి బుగ్గన ఝలక్?

వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని స్థాయిలో చక్రం తిప్పిన  ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. 2024 ఎన్నికలలో బుగ్గన  పరాజయం పాలయ్యారు. కర్నూలు జిల్లా డోన్ లో తెలుగుదేశం అభ్యర్థి కోట్ల విజయం సాధించారు. డోన్ లో తెలుగుదేశం జెండా ఎగరడం పదేళ్ల తర్వాత  ఇదే తొలిసారి. చంద్రబాబు వ్యూహం ఫలించి కోట్ల విజయం సాధించారు. బుగ్గన పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పి, ఐదేళ్లూ వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన ఆ ఓటమితో డోన్ లో అడ్రస్ లేకుండా పోయారు.  అపర మేధావిలా అసెంబ్లీ లో వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార వ్యవహారాల కోసం జగన్‌కి హ్యాండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట. అయితే కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఏం చేయాలో తోచక అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం తెలుగుదేశంలో  ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలే ప్రత్యర్ధులుగా కొనసాగాయి.  1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీ మధ్యే ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనూహ్యంగా కేఈ కృష్ణమూర్తిపై గెలుపొందారు. రెండోసారి కూడా గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు చక్రం తిప్పారు 

రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ, కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటి కిందకు చేరడం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు ఘోర పరాజయం తప్పలేదు. అదీ కాక నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా అసెంబ్లీలో పిట్టకథలు చెప్తూ గడిపేసిన బుగ్గనపై డోన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఓటమి తర్వాత బుగ్గన డోన్ వాసులకు నల్లపూసై పోయారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారిస్తోందన్న ప్రచారంతో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్‌ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్‌ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్‌. వాటికి తోడు  సొంత మండలం బేతంచెర్లలోనే బుగ్గన తీవ్రస్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారంట. 

ప్రస్తుతం కేసుల భయం వెంటాడుతుండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్‌కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడి పెద్దలతో అంతో ఇంతో పరిచయాలు పెంచుకున్న ఆయన.. బీజేపీలో చేరడానికి వారితో మంతనాలు సాగిస్తున్నారంట. అందుకే ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదనీ, ఎక్కువ టైమ్ ఢిల్లీలోనే గడుపుతున్నారని బుగ్గన అనుచరులు చెప్పుకుంటున్నారంట. బీజేపీలో చేరడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసి డోన్ కూటమి నేతలు తమ అధిష్టానాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట. దాంతో బుగ్గనకు కూటమి పార్టీల్లో ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయిపోయారంటున్నారు. ఆ క్రమంలో బుగ్గన ఆచూకీ ఆయన సొంత అనుచరులకే అంతుపట్టకుండా తయారైందంట.

telugu one news

Teluguone gnews banner