గూగుల్ లో సెర్చ్.. నైట్రోజన్ గ్యాస్ తో బీటెక్ స్టూడెంట్ సూసైడ్..
posted on Mar 2, 2021 @ 11:18AM
రామకృష్ణ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక నైట్రోజన్ వాయువు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామకృష్ణ (25) బీటెక్ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా అతడు తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బంధువులతో అంటుండేవాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోయింది. స్నేహితుడిని కలిసి వస్తానని హైదరాబాద్ వచ్చిన అతను మసాబ్‌ట్యాంక్‌లో హైదరాబాద్ హైట్స్ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఉదయం గది తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు. నైట్రోజన్ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని. గూగుల్ లో చూసి నైట్రోజన్ వాయువు పీల్చి చనిపోయి ఉంటాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నేటి విద్యార్థులే రేపటి నవభారతపు పునాదులు. ములుకో గమ్యాన్ని చేరుకో, అనే పదాలు పాఠ్యపుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయ్యామని, అమ్మాయి ప్రేమించలేదని, పక్కవాడు అవమానించదని.టీచర్ కొట్టిందని మానసిక ఒత్తిడి పెరిగిందని. ఇలా సమస్య ఏదైనా ప్రాణాలు తీసుకోవడమే సోలుషన్స్ అనుకుంటున్నారు నేటి విద్యార్థులు. తమ భవిష్యత్తుని మరిచి ఆవేదనలో ప్రాణాలు వీడుతున్నారు. బడి నేర్పించిన చదువు అదేనా. లేదా తల్లి దండ్రులు ప్రధమ గురువులుగా నేర్పిన పాఠం సమస్యలు వస్తే తనువుచాలించాలని చెప్పిందా.కారణం ఏదైనా నేటి విద్యార్థులు నిండు ప్రాణాలను బలికోరుకుంటాన్నారు.