యూట్యూబ్‌తో బలవన్మరణం... హైదరాబాద్‌లో వింత ఆత్మహత్య

 

ఒక్క స్మార్ట్ ఫోన్ తోపాటు ఇంటర్నెట్ ఉంటే చాలు... ప్రపంచం మీ గుప్పిట్లో ఉన్నటే. అంతలా ప్రపంచాన్ని చిన్నది చేసింది స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. అయితే, ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే మంచిదే... కానీ, ఇదే టెక్నాలజీతో కొంతమంది యువత పెడద్రోవ పడుతోంది. లోక కల్యాణానికి వినియోగించాల్సిన టెక్నాలజీని స్వనాశనానికి వాడుతోంది. సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాల్సిన మేథస్సును... విధ్వంసానికి, విశృంఖలత్వానికి ఉపయోగిస్తోంది. ముఖ్యంగా యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం దారుణాలకు దారి తీస్తోంది. మనిషి ప్రాణాలను కాపాడే టెక్నాలజీతోనే తమ ఆయువును తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ బీటెక్ విద్యార్ధి ఇలాంటి దారుణానికే పాల్పడ్డాడు. చనిపోయిన తర్వాత ఏం జరగనుందో తెలుసుకోవాలంటూ బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చాడు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న తీరు... తల్లిదండ్రులనే కాదు, స్థానికులను, పోలీసులను కూడా నివ్వెరపోయేలా చేసింది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే అలాంటి సంఘటనను ప్రత్యక్షంగా చూసి ఇదేం దారుణమంటూ మాట్లాడుకున్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడమే తప్పంటే, బీటెక్ విద్యార్ధి గణేష్ మాత్రం అందరిలా తానెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో ఏమో గానీ, ఎవ్వరూ ఊహించనిరీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి పాలిథిన్ కవర్‌ను చుట్టుకుని, నైట్రోజన్ ఆక్సిజన్‌ సిలిండర్ పైపులను ముక్కులో పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, గణేష్ ఆత్మహత్య చేసుకున్న తీరే విస్తుగొలిపితే, అతను రాసిన సూసైడ్ నోట్ మరింత సంచలనంగా మారింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందని, అందుకే చనిపోతున్నానంటూ అతడు రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.

ఇక, ఆత్మహత్యకు ముందు వారం పది రోజులుగా...  ఎక్కువ బాధ లేకుండా ఈజీగా ఎలా చనిపోవాలో గణేష్‌ యూట్యూబ్‌‌లో విపరీతంగా సెర్చ్‌ చేశాడు. అయితే, ఆత్మహత్యకు పక్కాగా ప్లాన్ వేసుకున్న గణేశ్... అందుకు అవసరమైన సామాన్లను ఒక్కొక్కటికి ఇంటికి తెచ్చుకున్నాడు. ఫిబ్రవరి 14న ఎర్రగడ్డలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి మూడున్నర వేలు వెచ్చించి నైట్రోజన్ ఆక్సిజన్ సిలిండర్‌‌... పైపులు... పాలిథిన్ కవర్లు కొనితెచ్చుకున్న గణేష్‌... స్టోర్ రూమ్‌లో దాచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వాటితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్యకు ముందు నేను నా రాక్షసి సినిమాలో తేలికగా చనిపోయే కొన్ని దృశ్యాలను గణేష్‌ విపరీతంగా చూసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సినిమాలో బండరాళ్లు కట్టుకొని నీటిలో దూకడం, ఇంజక్షన్లు తీసుకొని శరీరం బండబారేలా చేసుకోవడం వంటివి పదేపదే చూసినట్లు తెలుస్తోంది.

Teluguone gnews banner