అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
posted on Mar 13, 2025 @ 4:30PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతకు ముందు స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు ఆయన తీరు బాధాకరమన్నారు. స్పీకర్ ను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని చెప్పారు. నిబంధనల ప్రకారం సభ్యులోవరూ స్పీర్ పై వ్యాఖ్యలు చేయరాదనీ, ఆయన అధికారాలను ప్రశ్నించరాదనీ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో స్పీకర్ జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.