Read more!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుత సమావేశాలలోనే మహాళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని కోరారు.

అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కాగా ఇటీవలే ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం హస్తినలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఆమె త్వరలో దేశంలోని వర్సిటీలు, కాలేజీలలో రౌండ్ టేబుల్ సమావేశాలకు ప్రణాళిక రూపొందించారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ విద్యావేత్తలు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.  ఈ నేపథ్యంలోనే లోక్ సభలో బీఆర్ఎస్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది.