ప్రేమించిన చెల్లి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించిన అన్న..
posted on Jun 23, 2021 @ 10:47AM
కడప జిల్లా. రాయచోటి. ఆ పేరు వింటేనే ఫ్యాక్షన్ గుర్తుకు వస్తుంది. అరవింద సామెత వీరరాఘవ సినిమాలో చెప్పినట్లు అవసరమైన రూపాయలు 5 కు కూడా దారుణంగా సత్యాలు చేస్తారు.. అది ఒకప్పటి మాట.. కొద్దీ కాలం గా ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతగా ఉంది సీమ.. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఊపు అందుకుంది. పాతకక్షలు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి.. శవాలు ఊరూరా వెలుస్తున్నాయి.. ఒక వైపు పాతకక్షలు అయితే తాజాగా పరువు హత్యలు స్టార్ట్ అయ్యాయి.. మేనమామ కుమారుడిని ప్రేమించిందని ఆగ్రహానికి గురైన అన్న.. ఈనెల 15న యువతిపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రాణంతో పోరాడుతూ చావును సవాలు చేస్తూ తాజాగా తుదిశ్వాస విడిచింది.
రాయచోటి పట్టణం కొత్తపల్లెలో నివాసం ఉంటున్న పఠాన్ మహమ్మద్, మున్వర్ జాన్‌ల కుమార్తె తహసీన్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాలను ఆమె తిరస్కరించింది. తాను ఇమ్రాన్ అనే యువకుడిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పేసింది. అంతే, కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. కూతురిపై కన్ను ఎర్ర చేశారు. తాము సూచించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా చెప్పారు. ఎంత చెప్పిన వినకపోవడంతో . అతని మేనమామ కొడుకునే పెళ్లిలో చేసుకుంటాను అన్న మాటలు ఆమె సోదరుడిని బరితెగించేలా చేసింది. ఇక అంతే ఆమె తల్లిదండ్రుల పరువు అనే ఉన్మాదానికి మరో యువతి బలైంది. యువతిపై ఇంట్లో వారే పెట్రోల్ పోసి తగులబెట్టారు. యువతి తల్లిదండ్రులు ఈ అరచాకాన్ని దగ్గరుండి మరీ ప్రోత్సహించారు. మంగళవారం రాత్రి రాయచోటి పట్టణంలో ఈ ఘటన సంచలనం రేపింది.
యువతి కేకలు విన్న ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడ్డ తహసీన్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన యువతి అన్న పట్టన్ తాజుద్దీన్, తల్లి పట్టన్ మున్వార్ జహాన్, తండ్రి పట్టన్ మహమ్మద్ షరీఫ్‌లు ఇప్పటికే అరెస్టు చేసి కడప జైలుకు తరలించారు.