కేటీఆర్ తో జగన్.. దావోస్‌లో ‘తెలుగు’ సినిమా!
posted on Jun 8, 2022 @ 5:36PM
కష్టాలు అందరికీ వుంటాయి. కష్టాలు చెప్పుకోవడానికి ఆత్మీయులు వుండాలి. వారిని నుంచి మంచి సలహా లతో వాటిని అధిగమించే అవకాశాలు వుంటాయి. కుటుంబంలో వచ్చిన కష్టాలను పంచుకునేందుకు జగన్‌కు కేటీఆర్ దొరికేడు!
దావోస్ సదస్సుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణా టిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్ అక్కడ కలుసుకున్నారు. కష్టసుఖాలు కలబోసుకున్నారు. ఇక్కడ యావత్ తెలుగు ప్రజల్ని ఆశ్చర్యపరిచేది వారి మధ్య రాజకీయపరమైన విమర్శలకు తావులేదన్న ట్టు వ్యవహరించడం. ఎందుకంటే అంతకు కొద్ది రోజుల ముందే కేటీఆర్ తెలంగాణాలో గ్రామాల్లోనూ రోడ్డు రవాణా బాగుంటుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆంధ్రా ప్రాంతాల కంటే తెలంగాణా ఇటీ వలి కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నాడు.
ఒక విధంగా ఆంధ్రా కంటే తామే మెరుగయిన స్థాయిలో వున్నామని వెక్కరించడమే చేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత దేశం సరిహద్దులు దాటంగానే వారి మధ్య ఈ తరహా రాజకీయ పరమైన విభేదాలు మటుమాయమైపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అసలేం జరగనట్టే వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు. అక్కడ ఇరు రాష్ట్రాల అభివృద్ధి, రాజకీయాల గురించే కాకుండా చాలా ఆత్మీయంగా ఇంటి విషయాలు కూడా చర్చించుకోవడం చిత్రం! ఆర్చినా తీర్చినా నువ్వే వదినా! అంటూ తోడికోడళ్లు మాట్లాడుకున్నంత ప్రేమగా వీరిరువురూ మాట్లాడుకోవడ మే పెద్ద చర్చగా మారింది.
ఇద్దరూ కుర్రాళ్లు గనుక ఖాళీ సమయంలో, పోనీ లంచ్ బ్రేక్‌లో ఏదో మెగా స్టార్, ప్రభాస్ల గురించి మాట్లాడు కోలేదు. ఏకా ఎకీ అన్న చెల్లెళ్ల మధ్య విభేదాల గురిం చి చర్చించు కోవడమే ఆశ్చర్యం కలిగించింది. జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణాలో ఒక పార్టీ అధినేత. ఆమెతో అన్నకి పడటం లేదన్నది చాలా రోజు లుగా వినవస్తున్న సమాచారం. కానీ కేటీఆర్ కూడా అదే సంగతి జగన్‌ను అడిగేడు. అందులో నిజమెంత అని! జగన్ ఔననే సమాధానమిచ్చాడు. తండ్రి వై.ఎస్.మరణానంతరం వారి మధ్య విభేదాలు తారస్థాయి కి చేరు కుని, షర్మిల కొత్త పార్టీ పెట్టి ఇటు తెలంగాణాలో నిలదొక్కుకోవాలన్న ప్రయత్నాల్లో తలమునక లయింది.
మరణానికి బాగా ముందే తమ ఆస్తి పిల్లలు ఇద్దరికీ సరి సమానంగా ఇస్తానని తండ్రి వైఎస్ అనడం జగన్‌కు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ షర్మిల వివాహానంతరం ఆస్తిలో సగభాగం ఎలా అడుగు తుందని చాలా సాదా సీదా మధ్య తరగతి అన్నలానే చెల్లిని, తల్లిని ప్రశ్నించే వుంటాడు. అదే సంగతి సోదర సమానుడు, మిత్రుడు కేటీఆర్‌తోనూ ప్రస్తావించేడు. అవును సాధారణ పరిస్థితుల్లో జగన్ చెప్పింది కరష్టే కదా అనుకున్నాడు కేటీఆర్. కానీ రాజకీయపరంగా కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆఖరికి జగన్‌కి తల్లిని కూడా దూరం చేసినట్టు వార్తలు వినవస్తున్నాయి. షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టిన పుడు ఆమె తల్లి చాలా ఆనందించింది.
అన్నా చెల్లి మధ్య విభేదాలు సామరస్యంగానే ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించుకోవాలి. దాదాపు ఇలాంటి సలహానే సోదర సమానుడయిన ప్రియమిత్రుడు చెప్పేడు. అవును వైఎస్ కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు న్యాయపరంగా పరిష్కరించు కోవాల్సిం దేనని జగన్ వివరణ.
కష్టసుఖాలు పంచుకోవడానికి జగన్ కి కేటీఆర్ దొరికేడు. ఈ చర్చ, ఈ సాన్నిహిత్యం మరి వారి రాజకీయా భివృద్ధికి ఏమాత్రం ఉపకరిస్తుంది? ఇప్పటివరకూ మంచి స్నేహితులే. ఆనక ఏ బిజెపీ వారి వల్లనో, కేటీ ఆర్ తండ్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాల చిక్కులతోనో ఈ స్నేహం దెబ్బతింటే పరిస్థితి ఏమిటి. అపుడు ఒకరికి ఒకరు సాయం చేసుకుని ముందడుగు సినిమాలోలా కలిసి ముందడుగు వేయడానికి వీలుంటుం దా? ఎందుకంటే తెలంగాణాలో షర్మిల కేటీఆర్ కుటుంబాన్ని అన్ని వేదికల మీదా, పాదయాత్రల్లోనూ తిట్టిపోస్తోంది మరి!