బెంగాల్ లో ఘర్ వాపసీ.. బీజేపీకి ముకుల్ రాయ్ ఝలక్..
posted on Jun 11, 2021 @ 6:22PM
అనుకున్నదే జరిగింది. బెంగాల్ రాజకీయాల్లో కీలక నేత, రాష్ట్రంలో తృణమూల్ నుంచి బీజీపీలోకి వలసల వరదకు శ్రీకారం చుట్టిన కంద్ర మాజీ మంత్రి ముకుల రాయ్, సొంతగూటికి చేరుకున్నారు. ఒక విధంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు బీజం నాటిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, శుక్రవారం కుమారుడు సుభ్రన్షుతో కలిసి తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ సమక్షమలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. గతంలో పార్టీలో సీనియర్ నేతగాఉంటూ ఎన్నో పదవులు అనుభవించిన ముకుల్ రాయ్ 2017లో బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ చేరిన తర్వాతనే రాష్ట్రంలో కమల దళానికి ఊపోచ్చింది. అనేక మంది తృణమూల్ నాయకులు ఆయన్ని ఫాలో అయ్యారు. ఈ ఊపులోనే బీజేపీ గత లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుంది.
అయితే, ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉహించిన ఫలితాలు సాధించలేక చతికిల పడింది. ఇక అప్పటి నుంచి, తృణమూల్ గోడదూకి బీజేపీలో చేరిన నాయకులు సొంతగూటికి చేరేందుకు తహతహ లాడు తున్నారు. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా నిరయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2017లో వలసలకు శ్రీకారం చుటిన ముకుల్ రాయ్ తోనే ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టారు.
ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని, అటు మీడియా వర్గాల్లో,ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో చర్చ జరిగింది. ముదొంచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, మొన్నటి ఆసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన సువేందు అధికారికి బీజేపీ ఢిల్లీ పెద్దలు పెద్ద పీట వేయడం, ఆయనను, బీజేపీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికోవడం ముకుల్ రాయ్’ జీర్ణించుకోలేక పోతున్నారని , అందుకే ఆయన మళ్ళీ మమత వైపు చూస్తున్నారని గత కొంతకాలంగా మీడియా వర్గాల్లో వినవస్తోంది. ఆ విధంగా ఇద్దరి ఉమ్మడి శత్రువు సువేందు ఆ ఇద్దరినీ కలిపారు.
ఇటీవల ముకుల్ రాయ్’ సతీమణి అనారోగ్యంతో కోల్’కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించడంతో పాటుగా, ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. నిజంగా ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ మర్నాడు ఉదయమే ప్రధాని నరేంద్ర మోడీ ముకుల్ రాయ్’కి ఫోన్ చేసి, అయన భార్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా, అభిషేక్ బెనర్జీ, ముకుల్ రాయ్’ని కలవడం ఆ వెంటనే ప్రధాని ఫోన్ చేయడంతో అప్పుడే ఉహాగానాలు మొదలయ్యాయి. ఇప్పడు ఆ ఊహగానలేనాలే నిజమయ్యాయి.
నిజానికి అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఘన విజయం సాధించి మూడవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ, దిపేందు బిస్వాస్, సరళ మురు, అమల్ ఆచార్య సహా మరికొందరు సొంతగూటికి చేరేందుకు ఎదురుచూస్తున్నారు, ఇక ఇప్పుడు వారికి కూడా లైన్ క్లియర్ అయినట్లేనా అనేది చూడవలసి ఉంది, అలాగే, బీజేపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా త్వరలో క్యూ కడతారని అంటున్నారు. ముఖ్యంగా కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ ఘర్ వాపసీ మీద దృష్టి కేంద్రీక రించారని, కొద్ది రోజుల్లోనే బీజేపీ ఖాళీ అవుతుందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.