మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు... ఇదేం సర్వే?
posted on Aug 19, 2014 @ 9:31PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి విమర్శలు సంధించారు... అవి..
1. మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు. మా కుటుంబ వివరాలు నమోదు చేసుకోలేదు. ఇదేం సర్వే?
2. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేదు.
3. ప్రభుత్వ లక్ష్యమేంటో అర్థం కాని సర్వే ఇది.
4. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించలేదు. హైదరాబాద్‌లో అద్దెకి వుంటున్న వారి వివరాలు కూడా తీసుకోలేదు.
5. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ఓల్డ్ సిటీలో అమ్ముతున్నారు. ఈ విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధం.
6. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది?