ఎపిలో క్రాస్ వోటింగ్ బిజెపి కొంపముంచింది
posted on Jun 6, 2024 @ 4:54PM
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్లో టిడిపి, జనసేన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నారు. జనసేన అయితే పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్ల మెంట్ స్థానాలు చేజిక్కుంచుకుంది. బిజెపి మాత్రం పోటీ చేసిన ఏడుస్థానాల్లో మూడు స్థానాలు దక్కించుకుని నాలు లుగు స్థానాలు కోల్పోయింది.
బిజెపి ఓడిపోయిన నాలుగుస్థానాల్లో టిడిపి, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. దీన్ని బట్టి గెలిచేస్థానాలు కూడా బిజెపి ఓడిపోయింది. ఈ స్థానాలకు టిడిపి, జనసేనలకు కేటాయిస్తే మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేవి. సునామీలా టిడిపి , జనసేన అభ్యర్థులు గెలిస్తే బిజెపి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరాజయం చెంది మిత్ర పక్షాల మద్దత్తుతో మూడు స్థానాలను దక్కించుకుని పరువు కాపాడుకుంది. తెలుగుదేశం పార్టీ , జన సేనలు సీట్ల షేరింగ్ ఒప్పందాల ప్రకారం తమకు కు కేటాయించిన లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా గెలుచుకున్నాయి. . జనసేన అయితే వంధశాతం సక్సెస్ రేటు ఉంది. టిడిపి 16 లోకసభ స్థానాలను గెలుచుకుని తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ సీట్ల ల్లో కూటమి అభ్యర్థులు 24 సునాయాసం గా గెలిచే వారు. కాని బిజెపి ఓవరాక్షన్ వల్లే కూటమిలో ఉండి కూడా సక్సెస్ కాలేకపోయింది. కూటమిలో బిజెపి పరాజయాన్ని పరిశీలిస్తే . 21 చోట్ల కూటమి అభ్యర్థులుగా గెలిచి ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేవారు. రాజంపేట ,తిరుపతి, అరకులలో కూటమి పార్లమెంటు స్థానాలు కోల్పోవడానికి కారణాలు పరిశీలించాల్సి ఉంది.అత్యంత భారీ సంఖ్యలో బిజెపి కి వ్యతిరేకం గా మైనారిటీ, ఎస్టీ వర్గాల ఓటు పడడం అని పోల్ అయిన ఓట్ల విశ్లేషణ లో తెలుస్తోంది బిజెపి ఎంపీ గా పోటీ చేసిన 7 ఎంపీ సీట్లలో ఎంఎల్ ఏ అభ్యర్థులకు ఓట్లు కూటమికి వేసి ఎంపీ అభ్యర్ధి అయిన బి.జెపి కి వెయ్యని ఓట్లు 5,96,697 ఉన్నాయి. రాజంపేటలో బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 76,061 ఓట్లుతో ఓడిపోయారు
కూటమి ఎంఎల్ఏ అభ్యర్థులకు 20,973 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ క్రాస్ అయిన వోట్లు - 97,034 అని గమనించాలిఅరకులో బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత 50,580 ఓట్లుతో ఓడిపోయారు. కూటమి ఎంఎల్ ఏ అభ్యర్థులకు 32,862 ఓట్లు అధికంగా వచ్చాయి. దీన్ని బట్టి క్రాస్ అయిన ఓట్లు - 83,442 అని అర్థం చేసుకోవాలి.తిరుపతి లో బిజెపి అభ్యర్థి ప్రసాద్ 14,569 ఓట్లుతో ఓడిపోయారు. కూటమి ఎంఎల్ ఏ అభ్యర్థులకు 1,91,888 ఓట్లు అధికంగా వచ్చాయి క్రాస్ అయిన ఓట్లు 2,06,457 అన్నమాట.
రాజమండ్రి లో బిజెపి అభ్యర్థి పురందరేశ్వరి 2,39,139 ఓట్లుతో గెలిచారు. కూటమి ఎంఎల్ఏ అభ్యర్థులకు 2,84,427 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ క్రాస్ అయిన ఓట్లు - 452,88 అని చెప్పుకోవచ్చు. అనకాపల్లిలో బిజెపి అభ్యర్థి సిఎం రమేష్ 2,96,530 ఓట్లుతో గెలిచారు. కూటమి ఎంఎల్ఏ అభ్యర్థులకు 3,35,207 ఓట్లు అధికంగా వచ్చాయి. క్రాస్ అయిన ఓట్లు 38,677 అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నర్సాపురం లో బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ 2,76,802 ఓట్లుతో గెలిచారు. కూటమి ఎంఎల్ఏ అభ్యర్థులకు 4,02,601 ఓట్లు అధికంగా వచ్చాయి. క్రాస్ అయిన ఓట్లు 1,25,799 అని చెప్పుకోవాలి. ఒక్కో నియోజకవర్గం లో యావరేజ్గా లక్ష ఓట్లు క్రాస్ ఓటింగ్ లో పోయాయి...టీడీపీ గానీ జనసేన గానీ పోటీ లో ఉండి ఉంటే మొత్తం 24 ఎంపీ సీట్లు కూటమి కే దక్కేవి ఆంధ్ర లో ! కడప ఒక్కటి వైసీపీ కి వచ్చేది.