డైవోర్స్ తప్పే..! బిల్‌గేట్స్ కన్నీటి కహానీ..!
posted on Jul 15, 2021 @ 3:04PM
వాల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్స్ విడాకులకు సిద్ధమైపోయారు. రేపేమాపో అఫిషియల్‌గా డైవోర్స్ తీసుకోబోతున్నారు. ఆస్థి పంపకాల ప్రక్రియ సైతం వేగంగా జరిగిపోతోంది. ఎప్పటి నుంచో వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇకపై శాశ్వతంగా వారి మధ్య ఎడబాటు రాబోతోంది. బిల్‌గేట్స్‌కు మరో మహిళతో ఎఫైరే.. మిలిండాతో విడాకులకు దారి తీసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ ఈ విషయంలో సైలెన్స్ మెయిన్‌టెన్ చేసిన గేట్స్.. తాజాగా ఆయన మౌనం వీడారు. విడాకులపై స్పందించారు. కారణం చెప్పాలు. కన్నీరు పెట్టారు.
గతవారం జరిగిన ‘సమ్మర్ క్యాంప్ ఫర్ బిలియనీర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్ భావోద్వేగంతో మాట్లాడారు. ఒక దశలో కంట తడిపెట్టినంత పని చేశారు. మెలిండాతో డైవోర్స్ వ్యవహారం, ఇక మీ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన డైవోర్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తప్పేనన్నారు. అయితే మరో మహిళతో తనది ‘ఎఫైర్’ అన్నదాన్ని ఒప్పుకోనని, అసలు ఆ పదమే సరికాదని అన్నారు. 20 ఏళ్లకు క్రితం తన సహోద్యోగితో బిల్‌గేట్స్‌కు శారీరక సంబంధం ఉండేదని.. ఆ విషయం తెలిసే మిలిందా ఆయనతో విడిపోయేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. తమది ఎఫైర్ కాదంటూ తాజాగా గేట్స్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మిలిండాతో విడిపోవాలనే నిర్ణయమూ తప్పేనంటూ ఆలస్యంగా గుర్తించినట్టున్నారు. కానీ, ఇప్పుడు సరిదిద్దుకునే స్థాయిని దాటిపోయింది పరిస్థితి అంటున్నారు.
2019 నుంచే బిల్‌గేట్స్‌ను దూరం పెడుతూ వచ్చిందట మిలిండా. అప్పటి నుంచే విడాకుల విషయమై లాయర్లతో సంప్రదిస్తూనే ఉంది. ఇక గత మే 4న తామిద్దరమూ డైవోర్స్ తీసుకోబోతున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు మిలిండా-గేట్స్ దంపతులు. పిల్లలు, ఆస్తుల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.