బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ రాజీనామా
posted on Feb 20, 2015 @ 9:49AM
బీహార్ ముఖ్యమంత్రి మాంఝీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం నాడు ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షకు నిలవాల్సి వుంది. నిన్నటి వరకూ బలపరీక్షకు సిద్ధంగా వున్నానని చెబుతూ వచ్చిన ఆయన, శుక్రవారం ఉదయం బల పరీక్షకు ముందే రాష్ట్ర గవర్నర్ని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. మోడీ మీద అలిగి గత ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. మనోడే కదా అని మాంఝీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అయితే ఆ తర్వాత మాంఝీ ఏకు కాస్తా మేకు అయి కూర్చున్నాడు. తనను అందలం ఎక్కించిన ఎవర్నీ పట్టింటచుకోకుండా వ్యవహరించారు. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తూ ఇష్టానుసారం వ్యవహరించారు. దాంతో జేడీయు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. న్యాయంగా అయితే మాంఝీ అప్పుడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ అలా చేయకుండా రాజకీయాలు ప్రదర్శించారు. బీజేపీ మద్దతులో ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశించారు. బీజేపీ కూడా మద్దతు ఇచ్చే విధంగానే కనిపించింది. అయితే ఏ తేడా వచ్చిందోగానీ మాంఝీ రాజీనామా చేసేశారు.