బిగ్‌బాస్‌కి వేణు స్వామా? అసంభవం!
posted on Aug 13, 2024 @ 12:41PM
ఈమధ్య సోషల్ మీడియాలో ఒకటే ఊహాగానాల ఊదర వినిపిస్తోంది.. అందేంటంటే, ఫేక్ జ్యోతిషుడు వేణు స్వామి బిగ్‌బాస్ ప్రోగ్రాంలోకి కంటెస్టెంట్‌గా వెళ్ళబోతున్నాడని. ఇలాంటి ఊహగానాలు సృష్టించేవారు, ఇలాంటి ఊహాగానాలను నమ్మేవారు ఒకే పాయింట్ అర్థం చేసుకోండి. వేణు స్వామి బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్‌గా వెళ్ళడం కాదు.. బిగ్‌బాస్ ఫ్లోర్ క్లీన్ చేసే స్వీపర్‌గా కూడా వెళ్ళడు. ఎందుకంటే, బిగ్‌బాస్ ప్రోగ్రాం వెనుక వున్నది ఎవరు? ‘బాస్’ నాగార్జున. ఆయన ఈ పోరంబోకోడిని బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌కి ఎందుకు రానిస్తారు? ఈ వేణు స్వామి నిద్ర లేచింది మొదలు నాగార్జున కుటుంబం మీద విషం చిమ్ముతూ గడిపేస్తూ వుంటాడు. ఇప్పటికే చాలాసార్లు నాగార్జు కుటుంబ వ్యక్తిగత విషయాల మీద వేణు స్వామి నానారకాల కూతలు కూశాడు. లేటెస్ట్.గా నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత కూడా వేణు స్వామి తన దరిద్రపు నోటితో చాలా వాగాడు. అలాంటి వేణు స్వామిని నాగార్జున బిగ్‌బాస్‌కి ఎందుకు రానిస్తారు? ఈ లాజిక్ అర్థం చేసుకోండి యా!